News December 18, 2025
కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భారీ ఆదాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల సందర్భంగా హుండీలను 17, 18 డిసెంబర్ 2025 తేదీల్లో తెరచి లెక్కించారు. రెండు రోజుల్లో మొత్తం నగదు రూ.4,49,13,187, బంగారం 218 గ్రాములు, వెండి 17 కిలోలు 324 గ్రాములు లభించాయి. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఖతార్ సహా పలు దేశాల విదేశీ కరెన్సీ సమర్పణలు వచ్చినట్లు దేవస్థానం ఈవో శీనానాయక్ తెలిపారు.
Similar News
News December 20, 2025
ఇంటి నుంచే యూరియా బుకింగ్: కలెక్టర్

రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా రూపొందించిన కొత్త యాప్‌పై కలెక్టర్ అనుదీప్ మంగళవారం సమీక్షించారు. రబీ సీజన్ నుంచి రైతులు తమ ఇంటి వద్ద నుంచే మొబైల్ యాప్ ద్వారా యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌లో డీలర్ల వద్ద ఉన్న నిల్వల (స్టాక్) వివరాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని పేర్కొన్నారు.
News December 20, 2025
సర్పంచ్ ఫలితాలు.. 18 మంది ఎమ్మెల్యేలపై PCC చీఫ్ అసంతృప్తి

TG: సర్పంచ్ ఫలితాల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదని 18 మంది MLAలపై AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్స్‌ను బుజ్జగించలేకపోవడం, బంధువులను నిలబెట్టడంతో పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహించారు. ఫలితాలపై CM రేవంత్ క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుని రివ్యూ చేశారు. కొంత మంది MLAలను పార్టీపరంగా మందలించేందుకు ఆ నివేదికను PCC చీఫ్‌కు పంపించగా ఇవాళ సమీక్ష నిర్వహించారు.
News December 20, 2025
NZB: దొంగ నోట్లపై బీఆర్ఎస్ ట్వీట్

వర్ని కెనరా బ్యాంక్‌లో దొంగ నోట్ల కలకలం విషయం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్లు పంచి అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అభ్యర్థులు అని బీఆర్ఎస్ తన అధికారిక X(ట్వట్టర్)లో పోస్టు చేసింది. దొంగనోట్లు తెచ్చిన వ్యక్తి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడని ఆరోపించింది. అయితే పోలీసులు చెప్పిన నిందితుని పేరు.. బీఆర్ఎస్ పోస్టు చేసిన నిందితుని పేర్లు వేర్వేరుగా ఉండటం గమనార్హం.


