News September 23, 2025
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మహిళా నేతలు

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి అర్చకులు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Similar News
News September 23, 2025
GSTతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల నష్టం: పొన్నం

TG: ప్రజలను దోచుకునేందుకు GSTని కేంద్రం ఆయుధంగా వాడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘GST అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. శవపేటికలపై కూడా కేంద్రం ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లు ప్రజలను దోచుకుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి GST తగ్గించింది. దీంతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దాన్ని కేంద్రమే పూడ్చాలి’ అని డిమాండ్ చేశారు.
News September 23, 2025
ఈ అలవాట్లు అందానికి శత్రువులు

మచ్చలు లేకుండా అందంగా మెరుస్తూ ఉండే చర్మం కావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే దీనికోసం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మనిపుణులు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవాలి. చక్కెర, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎవరో చెప్పారని చర్మంపై ప్రయోగాలు చెయ్యకూడదు. కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పడుకొనే ముందు మేకప్ తొలగించాలి. నీరు ఎక్కువగా తాగాలి.
News September 23, 2025
ADB: 3 రోజుల్లో రిజర్వేషన్లు.. అంతటా ఉత్కంఠ..!

స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేరికలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఓటరు ముసాయిదా, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. రిజర్వేషన్లు ఖరారవ్వడమే లేటు అనుకున్న సమయంలో ప్రభుత్వం 2, 3 రోజుల్లో ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈసారి BCలకు 42% కల్పించే అవకాశాలుండటంతో ఆశావహులు పెద్దఎత్తున బరిలో నిలవనున్నారు. ఉమ్మడి ADBలో GP 1514, MPTC 581, ZPTC 69 స్థానాలున్నాయి.