News March 30, 2025
కనకదుర్గ దేవిని దర్శించుకున్న సింగరేణి జీఎం

రెబ్బెన మండలం కైరిగూడ ఉపరితల గని వద్దగల కనకదుర్గాదేవిని బెల్లంపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వా వాసు నామ ఉగాది సందర్భంగా ఘని వద్ద ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్మికుల కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. వీరితో ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఖైరిగూడ ప్రాజెక్ట్ ఆఫీసర్ M.నరేందర్ తదితరులున్నారు.
Similar News
News July 6, 2025
భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
News July 6, 2025
LEAP యాప్‌లో పొందుపరచాలి: కలెక్టర్

ఈనెల 10న ఏలూరు జిల్లాలో జరిగే మెగా పేరెంట్స్ మీట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆమె ఏర్పాట్లను సమీక్షించారు. ‘LEAP యాప్’లో కార్యక్రమ వివరాలను పొందుపరచాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నివేదికలను అందించాలన్నారు. మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యతిరేకత, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు.
News July 6, 2025
కోటపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

కోటపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.