News February 4, 2026

కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

image

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్‌లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.

Similar News

News February 22, 2026

చిక్కిపోతున్న చందమామ!

image

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.

News February 22, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై<<>> మెట్రో రైల్ లిమిటెడ్‌లో 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech అర్హతతో పాటు 15ఏళ్ల పని అనుభవం గలవారు మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జాయింట్ జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.1,45,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.1,25,000, మేనేజర్‌కు రూ.85,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chennaimetrorail.org

News February 22, 2026

రాశులు – ధరించాల్సిన రత్నాలు

image

మేషరాశి – పగడం, వృషభ రాశి – వజ్రం
మిథునం రాశి – పచ్చ, కర్కాటక రాశి – ముత్యం
సింహ రాశి – కెంపు, కన్యా రాశి – పచ్చ
తులా రాశి – వజ్రం
వృశ్చిక రాశి – పగడం
ధనుస్సు రాశి – పుష్య రాగం
మకర రాశి – నీలం
కుంభం రాశి – నీలం
మీనం రాశి – పుష్య రాగం