News July 4, 2024

కనిగిరిలో రెండో రోజూ ఆక్రమణల తొలగింపు

image

కనిగిరిలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం రెండో రోజూ కొనసాగుతోంది. పామూరు రోడ్డులో డ్రైనేజీ కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జేసీబీతో మున్సిపల్ అధికారులు తొలగించారు. రహదారులకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు కారణంగా పట్టణంలోని రహదారులు విస్తారంగా దర్శనమిస్తున్నాయి. నిన్న చెప్పులబజారు, ఒంగోలు బస్టాండు, పామూరు బస్టాండు సెంటర్లలో రోడ్డు వెంట ఉన్న ఫుట్‌పాత్‌ వ్యాపారులకు సంబంధించిన బంకులను తొలగించారు.

Similar News

News September 14, 2025

ప్రకాశం నూతన ఎస్పీ.. తిరుపతిలో ఏం చేశారంటే?

image

ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.

News September 14, 2025

ప్రకాశం లోక్ అదాలత్‌లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

image

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

News September 14, 2025

ప్రకాశం కొత్త కలెక్టర్ ముందు సవాళ్లు ఇవేనా..!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత కలెక్టర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేసిన ప్రభుత్వం, జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంలో రాజాబాబును ప్రభుత్వం గుర్తించి మరీ భాద్యతలు అప్పగించింది. అయితే నూతన కలెక్టర్ ముందు తొలుత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, వెలుగొండ పూర్తి, భూ సమస్యలు సవాళ్లుగా నిలవనున్నాయి.