News April 19, 2024
కనిగిరి: దద్దాలపై 420 కేసు

ప్రకాశం జిల్లాలో నామినేషన్ల పర్వం అట్టహాసంగా సాగింది. గురువారం బూచేపల్లి శివ ప్రసాద్, దద్దాల నారాయణ యాదవ్, మాగుంట శ్రీని వాసుల రెడ్డి నామినేషన్లు వేశారు. ఇందులో కనిగిరి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నామినేషన్ అఫిడవిట్లో తనపై 420, 506 సెక్షన్లతో సహా పలు కేసులున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన పేరిట రూ.70.33 లక్షలు, తన భార్య మంజు భార్గవి పేరిట రూ.62.03 లక్షల ఆస్తులున్నట్లు చూపారు.
Similar News
News April 22, 2025
కేవీపీఎస్ సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. కేవీపీఎస్ సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు-2025లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఒంగోలు అంబేడ్కర్ భవనంలో మే 8న, అలాగే మద్దిపాడులోని నటరాజ్ కళాక్షేత్రంలో మే 9న నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. కలెక్టర్ పాల్గొని తిలకించాలని ఆహ్వానించారు.
News April 22, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.