News August 25, 2025

కనిగిరి: నాన్నమ్మ అండతో జిల్లా ఫస్ట్ ర్యాంక్

image

కనిగిరి మండలం పాలూరివారిపల్లికి చెందిన లావణ్య డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమెది నిరుపేద కుటుంబం. లావణ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. పాలూరివారిపల్లిలోని నాయనమ్మ వద్దనే ఉంటూ కష్టపడి చదివింది. SGTలో ప్రకాశం జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. పేదరికాన్ని జయించేలా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో లావణ్యను పలువురు అభినందించారు.

Similar News

News August 25, 2025

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష.!

image

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.7వేల జరిమానాను విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడికి జైలు శిక్ష ఖరారుకావడంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి, 2000 సంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో కేసు నమోదు కాగా, సదరు వ్యక్తికి మూడేళ్ల శిక్ష ఖరారైంది.

News August 25, 2025

జిల్లాలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

image

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయండి.. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మరణానంతరం 6-8 గంటల్లో నేత్రదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

News August 25, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 80 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ దామోదర్ మీకోసం కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.