News July 22, 2024

కనిగిరి పోలీస్ స్టేషన్లో 108 అంబులెన్స్‌

image

కొనకనమిట్ల మండలానికి చెందిన 108 వాహనం ఈనెల 10న కనిగిరి మున్సిపాలిటీలోని టకారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనగా అతడు మృతి చెందాడు. ఆ అంబులెన్స్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. జిల్లాలోని పదుల సంఖ్యలో అంబులెన్స్‌‌లకు ఈ ధ్రువపత్రాలు లేవని పలువురు చెప్తున్నారు.

Similar News

News February 13, 2026

అసెంబ్లీలో మార్కాపురం MLA సంచలన వ్యాఖ్యలు

image

తమ జాయింట్ కలెక్టర్(JC) సరిగా పనిచేయడం లేదని మార్కాపురం MLA కందుల అన్నారు. ‘తర్లుపాడు(M) పూతలపాడు రైతుల భూముల వివరాల్లో ఊరి పేరు పోతవరంగా మార్చారు. దీంతో ఆ భూములు దేవదాయ శాఖవిగా మారడంతో అమ్ముకోలేకపోతున్నారు. దీనిపై 67 అర్జీలు ఇస్తే ఒక్కటీ పరిష్కరించలేదు. దీంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మా జిల్లాలో JCకు 1100 ఫైల్స్ వస్తే 100 పరిష్కరించి మిగిలినవి చెత్తలో పడేశారు’ అని MLA ఆరోపించారు.

News February 13, 2026

ఒంగోలు: రేపటి నుంచే బీచ్ ఫెస్టివల్‌.. టైమింగ్స్ ఇవే!

image

ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్ ఈనెల 14, 15వ తేదీల్లో జరగనుంది. 14వ తేదీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 11గంటల వరకు, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజా బాబు చెప్పారు. హెలికాప్టర్ రైడింగ్, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.

News February 13, 2026

బీచ్ ఫెస్టివల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.