News March 20, 2025

కనిగిరి: బాలికలపై వేధింపులు.. టీచర్ అరెస్టు

image

కనిగిరిలోని బాలికోన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రంగారెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. పాఠశాలలో కొందరు బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేయడంతో నిన్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయనను విధులనుంచి తొలగించారు.

Similar News

News March 20, 2025

ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!

image

ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల,బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.

News March 20, 2025

కందికి మద్దతు కల్పిస్తాం: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మర్రిపూడి మండలం చిమటలో ఏర్పాటు చేసిన కందుల సేకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మెట్రిక్ టన్నుల కందులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామన్నారు. చిమటలో 35 టన్నుల కందిని రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేశామన్నారు.

News March 20, 2025

ఒంగోలు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి.!

image

RTC బస్సులో మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులో నివాసం ఉంటున్న సాహినా బేగం హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో ఒంగోలు వస్తోంది. సంతమాగులూరు వద్దకు వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులు, ప్రయాణికులు గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు.

error: Content is protected !!