News September 25, 2024
కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 14, 2025
తెలంగాణలో పొదిలి, మార్కాపురం వాసులు మృతి.!

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందిన ఘటన తెలంగాణలో జరిగింది. పొదిలికి చెందిన సాయి ప్రసాద్, మార్కాపురంకి చెందిన రవితేజ, కంభంకి చెందిన వంశీకృష్ణలు నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు శుక్రవారం రాత్రి రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాగులో దిగారు. ఒక్కసారిగా ఊపిరాడక ప్రసాద్, రవితేజ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 14, 2025
నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉదయం 5.30కి బయలుదేరే ఈ రైలు ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.
News December 14, 2025
ప్రకాశం: గ్యాస్‌పై ఎక్కువ వసూలు చేస్తే.. నోటీసులే.!

సిలిండర్ డెలివరీకి అధికంగా పైసలు వసూలు చేస్తే IVRSకు పట్టుబడే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రభుత్వం తమ సేవల గురించి ప్రతి వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ చేస్తుంది. ఈ విధంగానే గ్యాస్ వినియోగదారులకు కూడా కాల్స్ ద్వారా డెలివరీ సమయంలో ఇబ్బందులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. వినియోగదారులు నేరుగా పలు గ్యాస్ ఏజెన్సీలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో దీనిపై ఆ ఏజెన్సీలకు అధికారులు నోటీసులిచ్చారు.


