News December 25, 2025
కనుక్కోండి చూద్దాం.. వీరిలో రోహిత్ ఎవరు?

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నిన్న సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ <<18659152>>మెరిసిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వికెట్ కీపర్ హార్దిక్ తమోరేతో రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ కూడా రోహిత్‌లా ఉండటమే ఇందుకు కారణం. అసలైన రోహిత్‌లా హార్దిక్ తమోరే కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పేరు, జెర్సీ నంబర్ లేకపోతే కనిపెట్టలేమని అంటున్నారు. మరి మీరేమంటారు?
Similar News
News December 27, 2025
పదేళ్లలో బంగారంపై 400%, వెండిపై 500% రిటర్న్స్!

పదేళ్లలో ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చిన రాబడులను గమనిస్తే బంగారం, వెండి మంచి లాభాలను అందించాయి. బంగారం 400% రిటర్నులతో దూసుకుపోగా, వెండి ఏకంగా 500% లాభాన్ని ఇచ్చింది. మన స్టాక్ మార్కెట్ NIFTY 50 కూడా 230% రాబడితో స్థిరంగా రాణించింది. అత్యధికంగా బిట్‌కాయిన్ $305 నుంచి $80,000కు చేరుకుని దాదాపు 30,000% రాబడిని ఇచ్చింది.
News December 27, 2025
క్యాబేజీ నాటే విధానం – యాజమాన్యం

క్యాబేజీ విత్తనాలు నాటే ముందు నేలను 4-5 సార్లు.. 100 చ.మీ. విస్తీర్ణంలో 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పి అవి మొలిచే వరకు రోజూ నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తాక ఎండిన ఆకులను తీసేయాలి. నారు కుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి. ఆకుతినే పురుగు నుంచి నారు రక్షణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News December 27, 2025
5 రోజుల్లో 5,000 కిలోమీటర్లు

వలస పక్షుల్లో అముర్ ఫాల్కన్లు (డేగలు) ఎంతో ప్రత్యేకం. మణిపుర్ నుంచి బయలుదేరిన 3 ఫాల్కన్లు (అపపాంగ్, అలాంగ్, అహు) 5 రోజుల్లో 5,000 KMకు పైగా ప్రయాణించి దక్షిణాఫ్రికా చేరుకున్నాయి. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నిర్వహించిన శాటిలైట్ ట్రాకింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇవి అరేబియా సముద్రాన్ని దాటి ప్రయాణించాయి. కేవలం 160-200 గ్రాములుండే ఈ పక్షులు రోజుకు 1000KM వరకు ప్రయాణించగలవు.


