News January 15, 2025
కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.
Similar News
News February 14, 2026
NZB: మేయర్ పీఠం కోసం వారి ఓట్లే కీలకం

NZB నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇందు కోసం MP, MLA, MLCలు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. దీంతో BJPకి చెందిన MP, NZB(U), ARMR MLAలతో పాటు ఇద్దరు MLCలు, కాంగ్రెస్‌కు చెందిన NZB(R), BDN MLAలతో పాటు జిల్లాకు చెందిన MLC మహేశ్ కుమార్ గౌడ్ ఓట్లు నమోదు చేసుకోనున్నారు.
News February 14, 2026
NZB: 18 నుంచి 14కు తగ్గిన MIM సీట్లు

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్‌లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.
News February 14, 2026
NZB: 2020లో 28.. 2026లో 28 సీట్లే

నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి 2020 ఎన్నికల్లో 28 సీట్లు వచ్చివచ్చాయి. అయితే ప్రస్తుత 2026 ఎన్నికల్లో కూడా 28 సీటు రావడం గమనార్హం. గత ఎన్నికల్లో 28 సీట్లతో కార్పొరేషన్‌లో లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 12 సీట్లు గెలిచిన BRS 18 మంది MIM, ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ కార్పోరేటర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో?


