News January 23, 2026

కనేకల్: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

image

కనేకల్ మండలం 43 ఉడేగోళం పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

Similar News

News February 15, 2026

అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

image

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో జరిగే సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.

News February 15, 2026

కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈనెల 16న అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించబడుతుందన్నారు. అర్జీదారులు అవసరమైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

News February 14, 2026

ముచ్చటగా మూడోసారి..

image

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఒటాన్ అకౌంట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన 2026-27 ఆర్థిక సంవత్సరానికి శనివారం ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి-సంక్షేమానికి సమతూకం కల్పించేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. సీఎం మార్గనిర్దేశంతో, పది రోజుల ప్రీ-బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ బడ్జెట్ సిద్ధమైంది.