News March 2, 2025
కనేకల్ : రెండు నాటు తుపాకుల కలకలం

కనేకల్లు మండల పరిధిలోని సొల్లాపురం గ్రామ శివారులో శనివారం రెండు నాటు తుపాకుల కలకలం రేపాయి. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకులు ఎవరివి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. నాటు తుపాకులు దొరకడంతో సొల్లాపురం గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
Similar News
News December 15, 2025
మడకశిర సౌందర్యకు ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ రన్నరప్

మడకశిరకు చెందిన సోను సౌందర్య ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి మడకశిర ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ఈ పోటీలలో ఆమె సత్తా చాటారు. అక్టోబర్‌లో ‘శ్రీమతి విజయవాడ’ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఆమె, బ్యూటీషియన్‌గా కూడా రాణిస్తున్నారు. సౌందర్య సాధిస్తున్న విజయాలు నేటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
News December 15, 2025
అనంతపురం జిల్లా TDP నేత మృతి

అనంతపురం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, రాయదుర్గం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.లోకానంద సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన లోకానంద లీగల్ సెల్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News December 15, 2025
కేఎల్ స్వామి దాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.


