News October 28, 2025
కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 28, 2025
HYD: స్కిల్ ఉంటేనే ఉద్యోగం!

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డిగ్రీ, పీజీ పట్టాలు చేత పట్టుకుని HYD వస్తున్న వారికి కార్పొరేట్ కంపెనీలు నిరాశ మిగులుస్తున్నాయి. యంగ్ యూత్ ఎంప్లాయబిలిటీ సర్వే ప్రకారం.. పట్టాలు ఉన్న ప్రయోజనం ఉండటం లేదని, ఉద్యోగం దొరకటం లేదని పేర్కొంది. పట్టాతో పాటు స్కిల్ ఉండి, అనుభవం కలిగిన వారికి రూ.40 వేల పైగా శాలరీతో ఉద్యోగాలు వస్తున్నాయని, లేదంటే రూ.15 వేలు రావటం కష్టంగా ఉందని పేర్కొంది.
News October 28, 2025
తిరుమలలో ఈనెల 30న పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. 29న బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సం గ్రహణం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం, సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
News October 28, 2025
కళాశాలల అభివృద్ధి పురోగతిపై కలెక్టర్ సమీక్ష

భద్రాద్రి జిల్లాలో జూనియర్ కళాశాలల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై, కళాశాలల్లో చేరికలు, ఉత్తీర్ణత శాతం, అవసరమైన మౌలిక సదుపాయాలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్.. ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. తరగతి గదులు, లీకేజీ నివారణ, విద్యుతీకరణ, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.


