News November 18, 2025

కన్నమదాసు.. పల్నాడు వీరత్వానికి ప్రతీక.!

image

పల్నాడు చరిత్రలో ధైర్యం, విశ్వాసం, విధేయతకు మారుపేరుగా కన్నమదాసు నామం నేటికీ ప్రతిధ్వనిస్తోంది. ఇతను మాచర్ల రాజ్యానికి అంకితభావంతో సేవలు అందించిన ముఖ్య సైన్యాధ్యక్షుడు. కారంపూడి యుద్ధాన్ని విజయపథంలో నడిపించడంలో ఆయనది కీలకపాత్ర. ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడికి రక్షకుడిగా నిలిచి, ఆయనను కాపాడారు. ఆయన వీరగాథకు సాక్ష్యంగా కారంపూడిలోని వీర్లగుడిలో ఇప్పటికీ ఆయన ఉపయోగించిన ఖడ్గం ప్రతిష్ఠించి ఉంది.

Similar News

News November 18, 2025

వేములవాడ: శరవేగంగా రాజన్న ఆలయాభివృద్ధి పనులు

image

వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పలు కట్టడాలను కూల్చివేశారు. కాగా, ఆలయం ఆవరణలోని స్వామివారి అద్దాల మండపం కూల్చివేత పనులను మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఒకవైపు దక్షిణ ప్రాకారం తొలగింపు, మరోవైపు అద్దాల మండపం తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

శంషాబాద్‌లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

image

శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్‌ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.