News March 14, 2025

కన్నాయిగూడెం: అస్వస్థతకు గురై కూలి మృతి

image

మిర్చి తోటకు పురుగుమందు పిచికారి చేస్తుండగా, అస్వస్థతకు గురై ఓ కూలి మృతి చెందిన ఘటన కన్నాయిగూడెంలో జరిగింది. ఎస్సై వెంకటేష్ వివరాలు.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాకేశ్ అనే వలస కూలి గురేవుల గ్రామంలోని సంతోష్ అనే రైతుకు పనికి వచ్చాడు. మిర్చి తోటలో పురుగుమందు పిచికారి చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 6, 2025

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు

image

మ్యాప్స్‌లో గూగుల్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. జెమినీ ఏఐ, వాయిస్ ఇంటరాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్స్, యాక్సిడెంట్లు జోన్ల వార్నింగ్, మెట్రో టికెట్ బుకింగ్స్ సదుపాయాలు తెస్తోంది. వాయిస్ ఇంటరాక్షన్‌తో డ్రైవింగ్‌లో ఉండగానే రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. రైడర్లు బైక్ ఐకాన్, రంగును మార్చుకోవచ్చు. రోడ్డు గరిష్ఠ వేగం కూడా తెలుసుకునే ఫీచర్ వస్తోంది.

News November 6, 2025

నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 6, 2025

జీవితం సంతోషంగా మారాలంటే..?

image

రాగద్వేషాలను వదిలిపెట్టి, మన ఇంద్రియాలకు సాక్షిగా ఉన్న ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించాలి. అలా మనం ఏకాగ్రతతో ఆయనపై భక్తి చూపి, ధ్యానం చేసినప్పుడు, ఈ దేహమే నేను అనే అహంకారం నశించిపోతుంది. దేహాభిమానం తొలగిపోతుంది. అప్పుడు సుఖదుఃఖాలు మనల్ని బాధించవు. ఇక బయటి ఆలోచనలు, కోరికలు పక్కన పెట్టాలి. మనసును పరమాత్మపై లగ్నం చేయాలి. ఫలితంగా నిజమైన శాంతి, ఆత్మనిర్భరత లభిస్తాయి. అప్పుడే జీవితం సంతోషమయం. <<-se>>#WhoIsGod<<>>