News December 29, 2025

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి మండిపల్లి..!

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడం దాదాపు ఖరారైంది. ఇదే అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈక్రమంలో మంత్రి మండిపల్లి కన్నీటి పర్యంతం కాగా.. ఆయనను సీఎం చంద్రబాబు ఓదార్చరని సమాచారం. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లె అవుతుందని సమాచారం.

Similar News

News December 29, 2025

అనంతపురం పోలీస్ కార్యాలయంలో వినతుల వెల్లువ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో ప్రతి పిటిషన్‌ను విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

News December 29, 2025

నారా లోకేశ్ లండన్ టూర్ అందుకేనా: YCP

image

AP: మంత్రి లోకేశ్ లండన్‌లో పర్యటిస్తున్నారంటూ YCP వరుస ట్వీట్‌లతో తీవ్ర విమర్శలు చేసింది. ‘నారా వారి వెన్నుపోటు వారసత్వం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో NTRకు చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబుకు లోకేశ్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించింది. తండ్రిని దింపి గద్దెనెక్కాలనే లోకేశ్ లండన్‌కు వెళ్లారా అని ప్రశ్నించింది. విదేశీ పర్యటన వివరాలను వెల్లడించకపోవడంపై టీడీపీలో గుసగుసలు మొదలయ్యాయంటూ పేర్కొంది.

News December 29, 2025

కర్నూలు: ‘నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలి’

image

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత www.ncs.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి సూచించారు. మొబైల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, కెరీర్ మార్గదర్శనం, జాబ్ మేళాల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలుంటే జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.