News April 11, 2025
కన్నుల పండువగా రాములోరి కళ్యాణం

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది భక్తులు తరలిరాగా మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అర్చకులు కళ్యాణం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించి భక్త జనం పులకించిపోయారు.
Similar News
News July 11, 2025
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం అమలు, లబ్ధిదారుల శిక్షణ, ఆర్ధిక సహకారం, టూల్ కిట్ల పంపిణి తదితర అంశాలపై సమీక్షించారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News July 11, 2025
కరీంనగర్: ప్రాణం తీసిన కోతులు

హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ మృతిచెందారని స్థానికులు తెలిపారు. నెల రోజుల క్రితం ఇంటి వద్ద అతడిపై కోతులు దాడి చేసి, కుడి కాలును కరిచాయని చెప్పారు. తీవ్రంగా గాయమై సెప్టిక్ అయినందున ఎంజీఎం ఆసుపత్రిలో 20 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతిచెందారన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోతుల కారణంగా ప్రాణం పోయింది.
News July 11, 2025
కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <