News April 13, 2025
కన్నెపల్లి: ప్రభుత్వ భూమి కబ్జా.. ఏడుగురి అరెస్ట్

కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో S.No248 లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం తెలిపారు. మండల తహశీల్దార్ ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించి ఆ భూమిలో చెట్లను నరికివేశారన్నారు. దీంతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
Similar News
News April 13, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: విశాఖ కలెక్టర్

ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు(ఏప్రిల్14న) రద్దు అయినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌తో పాటు, జీవీఎంసీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News April 13, 2025
ఆ సినిమాల కోసం ఎదురుచూస్తున్నా: రాజమౌళి

జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్} మూవీకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలను చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్లారు.
News April 13, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ఈనెల 14 సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడంతో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు తెలిపారు.