News August 22, 2025

కన్న కూతుర్లపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

image

రక్షించాల్సిన తండ్రే కన్న కూతుర్ల పాలిట కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆరిలోవలో ఉంటోన్న ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్ల (మైనర్ల)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించేవాడు. ఈ అఘాయత్యం తెలుసుకున్న తల్లి గత ఏడాది ఆరిలోవలో ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News August 22, 2025

అక్కిరెడ్డిపాలెంలో యువతి ఆత్మహత్య

image

అక్కిరెడ్డిపాలెంలో ప్రవళిక అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక తల్లి, సోదరునితో కలిసి ఉంటోంది. వారిద్దరూ ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుంది. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 22, 2025

ఆగస్టు 23న స్వచ్ఛంధ్ర దినోత్సవం: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు 23న ‘స్వచ్ఛాంధ్ర దినోత్సవం’లో భాగంగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు థీమ్ ‘వర్షాకాలం పరిశుభ్రత’ అని తెలిపారు. డెంగ్యూ, మలేరియా నివారణకు కాలువల శుభ్రపరిచడం, ఫాగింగ్, నీటి నాణ్యత పరీక్ష, టాయిలెట్ల పరిశుభ్రత, అవగాహనా కార్యక్రమాలు, పాఠశాలల్లో ప్రచారాలు నిర్వహించాలని గురువారం సూచించారు.

News August 21, 2025

జీవీఎంసీ కౌన్సిల్ హాలును పరిశీలించిన కమిషనర్ కేతన్ గార్గ్

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌ను పరిశీలించారు. శుక్రవారం నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శి బి.వి.రమణను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ హాజరు అవునున్న తరుణంలో కౌన్సిల్ హల్‌ను పరిశీలించారు.