News February 10, 2025
కన్మనూర్: విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే శ్రీహరి

మరికల్ మండలంలోని కన్మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Similar News
News November 10, 2025
వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి వివిధ వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులను పిలిపించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల అర్జీలకు తక్షణ స్పందనతో వ్యవహరించడం ప్రజల్లో సంతృప్తిని కలిగించింది.
News November 10, 2025
మాచర్ల: పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. ప్రభుత్వ సూచనల కోసం సమయం కావాలని న్యాయవాది లూథ్రా అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణలో ఉన్న పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం.
News November 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం


