News April 4, 2025
కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు

ఆత్మకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆర్యవైశ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 10, 2025
నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన A.లక్ష్మీ (60) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈనెల 4న గ్రామానికి చెందిన ప్రత్యర్థులు తనపైన, తన తల్లిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సురేశ్ తెలిపారు. కాగా ఈనెల 7న లక్ష్మీకి కడుపునొప్పి రాగా KGHకి తరలిస్తుండగా మృతి చెందినట్లు సురేశ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI సన్నిబాబు తెలిపారు.
News April 10, 2025
ప.గో జిల్లా రొయ్య రైతు ఆవేదన

ప.గో జిల్లాలో రొయ్య రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంటే, ఉమ్మడి ప.గో జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతూ మొదటి స్థానంలో నిలిచింది. కొనుగోలు దారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జూలై నుంచి పంట బ్రేక్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉండిలో జరగాల్సిన ఆక్వా రైతుల సదస్సు వాయిదా పడింది.
News April 10, 2025
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ

AP: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది.