News February 28, 2026

కప్పలబండలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

పుట్టపర్తి మం. కప్పలబండలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వయంగా పింఛన్ నగదు అందజేశారు. నారాయణప్ప, లక్ష్మి తదితరుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందిస్తూ.. పంపిణీ సక్రమంగా జరుగుతుందా అని ఆరా తీశారు. సిబ్బంది ప్రవర్తన, గౌరవంగా మాట్లాడుతున్నారా వంటి వివరాలను లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుంది: DGP

image

తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందు వరుసలో ఉన్నామని DGP శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. మహిళలు, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై విస్తృత సమీక్ష చేపట్టారు.

News March 1, 2026

నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి: తెలంగాణ డీజీపీ

image

నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదే విధంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్.. పోలీస్ సిబ్బంది, పోలీస్ పిల్లలను ఉత్తమ క్రీడాకారులను చేయడమే లక్ష్యంగా నిర్మితమైతుందన్నారు.

News March 1, 2026

యథావిధిగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్

image

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా రావడమే కాకుండా, https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని ఆమె వెల్లడించారు.