News December 27, 2025

కబడ్డీలో కరీంనగర్ జైత్రయాత్ర

image

ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో భాగంగా జరిగిన తొలి పోరులో సంగారెడ్డిపై 48 పాయింట్లు, రెండో మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై 21 పాయింట్ల తేడాతో గెలుపొందింది. వరుస విజయాలతో సత్తా చాటిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News December 30, 2025

బాపట్ల జిల్లాలో రూ.96.57 కోట్లు అందజేస్తాం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న NTR భరోసా పింఛన్ల సొమ్మును బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 2026 జనవరిలో 2,25,485 మందికి వివిధ రకాల పింఛన్ దారులకు రూ.96.57 కోట్లు అందజేస్తామని చెప్పారు. మంగళవారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేశామన్నారు.

News December 30, 2025

ఇతిహాసాలు క్విజ్ – 112 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: జరాసంధుడు బృహద్రథుడి కుమారుడు. బృహద్రథుడికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ సగం శిశువుకు జన్మనిచ్చారు. వింతగా ఉన్న ఆ శరీర భాగాలను బయట పారేయగా, ‘జర’ అనే రాక్షసి వాటిని దగ్గరకు చేర్చి కలిపింది. ఆ రెండు సగ భాగాలు అతుక్కుని పరిపూర్ణ బాలుడిగా మార్చింది. ‘జర’ అనే రాక్షసి ఆ శరీర భాగాలను సంధించడం వల్ల అతనికి ‘జరాసంధుడు’ అనే పేరు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 30, 2025

జగిత్యాల: అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో జాప్యం లేకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందాల్సిన లబ్ధిపై కమిటీ సభ్యులతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, డీఎస్పీలు తదితరులున్నారు.