News February 26, 2026

కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే పార్థసారథికి గాయం

image

అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గాయపడ్డారు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను పట్టుకునే ప్రయత్నంలో ఆయన కిందపడటంతో పాదం భాగంలో గాయమైంది. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయనకు గాయం కావడంతో తోటి ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

Similar News

News March 1, 2026

అల్లూరి జిల్లాలో పెరిగిన చికెన్ ధర

image

అల్లూరి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. బ్రాయిలర్ కిలో చికెన్ రూ.260 నుంచి 280 వరకు పాడేరు, చింతపల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ మరో రూ.20 అదనంగా అమ్ముతున్నామని వ్యాపారులు తెలిపారు. చేపలు కిలో రూ. 230 నుంచి 250 వరకు అమ్ముతున్నారు. మేక మాంసం రూ. 800 పలికిందని తెలిపారు.

News March 1, 2026

అనకాపల్లి: జిల్లాలో 91.37 శాతం పింఛన్ల పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో 91.37 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. మొత్తం 2,53,987 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,32,077 మందికి పంపిణీ చేశామన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈనెల 2వ తేదీన వారికి పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు.

News March 1, 2026

వేట్లపాలెం పేలుడు ఘటన.. మరొకరి మృతి!

image

వేట్లపాలెం బాణసంచా పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.