News October 14, 2025
కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మపురి విద్యార్థి

ఎస్జీఎఫ్ (SGF) రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు ధర్మపురి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థి ఎం.అఖిల్ ఎంపికయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న అఖిల్, 14 సంవత్సరాల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా రేపు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అఖిల్‌కు ZP ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ ఏ. స్వప్న మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 15, 2025
బిక్కనూర్: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

మద్యానికి బానిసగా మారి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్ మండలం జంగంపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నితిన్(21) కొంతకాలంగా మద్యానికి బానిసగా మారి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
News October 15, 2025
MNCL: ఈ నెల 18న కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీ

తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన అధికారి కార్యాలయ పరిధిలోని ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకుడు డా.కోటేశ్వర్ తెలిపారు. 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 1 పల్మనరి మెడిసిన్, 2 పీడియాట్రిక్ పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 10:30కు జిల్లా కార్యాలయంలో సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.
News October 15, 2025
GDP గ్రోత్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(IMF) 2025కు గాను ఇండియా GDP గ్రోత్‌ను రివైజ్ చేసింది. ఈ ఏడాదికి 6.4% గ్రోత్ ఉంటుందని పేర్కొన్న IMF దానిని 6.6%కు పెంచింది. 2026లో అది 6.2% ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికం. గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది 3.2% కాగా, వచ్చే ఏడాది 3.1%కు తగ్గొచ్చంది. US గ్రోత్ ఈ ఏడాది 2.0% ఉండగా 2026లో 2.1%కు పెరగొచ్చని తెలిపింది.