News January 4, 2025
కబళించిన మృత్యువు!
ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.
Similar News
News January 6, 2025
గడివేముల: రూ. లక్షలు డిపాజిట్ అయ్యాయ్.. వేరే వారికి పంపే వీలు లేదు
రూ. 3.24 లక్షలు ఖాతాలోకి జమచేసి బ్యాంకు అకౌంట్ హ్యాక్ చేసే యత్నం గడివేములలో ఆదివారం జరిగింది. పరమేశ్ బ్యాంకు ఖాతాలోకి రూ. 3.24 లక్షలు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది, ఖాతాలోనూ చూపించింది. కానీ వేరే వారి ఖాతాకు పంపేందుకు చూస్తే కుదురలేదు. మరొకసారి బ్యాంకు ఖాతా చెక్ చేయగా.. డిపాజిట్ అయిన నగదుతో పాటు తన డబ్బులు రూ. 1.600 కూడా కట్ అయ్యాయి. బాధితుడు మోసాన్ని గుర్తించి అప్రమత్తమయ్యాడు.
News January 6, 2025
మా ఊరిని టాప్ వన్‌గా మారుస్తా: కర్నూలు MP
తన సొంత గ్రామం పంచలింగాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే టాప్ వన్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని కర్నూలు MP బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు పరిధిలోని పంచలింగాల ఎస్సీ కాలనీలో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. త్వరలోనే పంచలింగాల రూపు రేఖలు మారబోతున్నాయని ఎంపీ అన్నారు.
News January 6, 2025
ఆస్పరి: ఆడుకుంటూ నిప్పు అంటించుకున్న చిన్నారులు
ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు బైక్‌లో పెట్రోల్‌ను బాటిల్లోకి తీసుకొని, ఒకరిపై ఒకరు చల్లుకొని నిప్పు అంటించుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.