News February 7, 2025

కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్‌కు దరఖాస్తు చేసుకువాలన్నారు.

Similar News

News February 7, 2025

విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ

image

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ జంబోరి వేడుకలలో పాల్గొని ప్రతిభ చూపిన జిల్లా స్కౌట్ విద్యార్థులను అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. మున్ముందు మరింత ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

News February 7, 2025

కోహ్లీ ఆడితే జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?

image

మోకాలి గాయంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడతారని సపోర్ట్ స్టాఫ్ తెలిపింది. అయితే ఆయన తుది జట్టులోకి వస్తే తొలి వన్డే ఆడిన ప్లేయర్లలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ స్థానంలో ఆడిన శ్రేయస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నేపథ్యంలో అతడిని పక్కనపెట్టే అవకాశం కనిపించడం లేదు. జైస్వాల్‌ను తప్పించి గిల్‌‌ను ఓపెనింగ్, కోహ్లీని వన్ డౌన్‌లో ఆడించే ఛాన్సుంది.

News February 7, 2025

బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్..!

image

మనిషి బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ సృష్టించిన ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు పేరున ఉన్న ఎల్ఐసీ బీమా డబ్బులను కాజేసేందుకు ఏజెంట్ ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా పది లక్షల భీమా సొమ్ము పొంది బాధితుడికి 3.5 లక్షలు ఇచ్చి మిగతావి ఏజెంట్ కాజేశాడు. విషయం బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

error: Content is protected !!