News July 7, 2024
కమలాపురం: రెండు నెలల బాలుడు మృతి

మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన రెండు నెలల బాలుడు శనివారం మృతిచెందాడు. ఏఎన్ఎం వ్యాధులు రాకుండా చిన్నారులకు శనివారం వ్యాధి నిరోధక టీకా వేసింది. అందులో భాగంగా రెండు నెలల బాలుడికి టీకా వేయించిన తల్లి అనంతరం పడుకోబెట్టింది. ఎంతసేపటికీ బాలుడు నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పెద్దచెప్పలి పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Similar News
News May 7, 2025
కడప: విద్యార్థుల అద్భుత కళా ప్రదర్శన

డాక్టర్. వైఎస్సార్ వర్సిటీ లో అప్లైడ్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల చిత్ర కళా ప్రదర్శన శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తాము అద్భుతంగా రూపొందించిన కళలను ప్రదర్శించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విశ్వనాథ కుమార్ విద్యార్థులు రూపొందించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని ప్రశంసించారు.. నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు తగిన సూచనలు అందజేశారు.
News April 25, 2025
లింగాల: పడిపోయిన అరటికాయల ధరలు.. ఆవేదనలో రైతులు

అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.
News April 25, 2025
అన్నమయ్య: పది పరీక్షలో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు మృతి

అన్నమయ్య జిల్లాలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పది పరీక్షలో పెయిల్ అయ్యానని ములకలచెరువు మండలం పెద్దమోరవ పల్లికి చెందిన నవనీ (15) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పది పరీక్షలు రాశాడు. అయినా ఫెయిల్ అవుతుండటంతో మనస్థాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది.