News March 2, 2025
కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 11, 2025
HNK నుంచి తిరుపతి, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు

WGL జిల్లా భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సేవలు ప్రారంభమవుతున్నాయని టీజీఆర్టీసీ RM డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలంకు, ఉదయం 8.40 గంటలకు తిరుపతికి ఏసీ రాజధాని బస్సులు నడుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంకు, రాత్రి 11.10 గంటలకు తిరుపతికి చేరుకుంటాయని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News November 11, 2025
తాకట్టు పత్రాలు ఇవ్వని ఎస్బీఐకి భారీ జరిమానా

రుణం తీరినా ఆస్తి పత్రాలు ఇవ్వని వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఎస్బీఐ బ్యాంకుపై కన్స్యూమర్ కోర్టు చర్యలు తీసుకుంది. వినియోగదారుడు డి. మల్లేశం ఫిర్యాదు మేరకు.. పత్రాలు ఇచ్చేవరకు రోజుకు రూ.5 వేలు, మానసిక వేదనకు రూ.లక్ష, కోర్టు ఖర్చులుగా రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును కోర్టు ఆదేశించింది.
News November 11, 2025
చిన్నారిపై లైంగిక దాడి.. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

నరసన్నపేట మండలానికి చెందిన రెండో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు చల్లా రామ్మూర్తి (70) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విషయాన్ని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, వృద్ధుడిని ఆదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.


