News March 2, 2025

కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 22, 2026

తిరుపతి: ముగిసిన ఐదో విడత ‘గరుడ అట్లాస్’

image

తిరుపతి పరిసర ప్రాంతాల్లో పక్షిజాతి వైవిధ్యాన్ని శాస్త్రీయంగా నమోదు చేసే గరుడ అట్లాస్ ఐదో విడత పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 274 పక్షిజాతులు నమోదు కాగా, ప్రస్తుత విడతలోనే 192 జాతులు గుర్తించారు. IISER తిరుపతి ఆధ్వర్యంలో, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీ శాఖ సహకారంతో 72 గ్రిడ్‌లలో సర్వే నిర్వహించారు. పట్టణ విస్తరణ, భూ వినియోగ మార్పుల ప్రభావాలను అంచనా వేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

News February 22, 2026

బొబ్బిలి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

image

బొబ్బిలి పట్టణం కుమ్మరివీధిలో ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేశ్ అనుమానంతో వేధిస్తున్నాడు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు CI నారాయణరావు చెప్పారు.