News October 7, 2025

కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించిన జేసి

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జేసి గోపాలకృష్ణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ కార్యక్రమాల షెడ్యూలింగ్, పర్యవేక్షించే పద్ధతిని జేసీ పరిశీలించారు. అనంతరం సూపర్ జిఎస్టి కార్యక్రమాల్లో వెనుకబడిన మండలాలు మున్సిపాలిటీలను గుర్తించి కమిషనర్లకు వెంటనే సమాచారం అందజేయాలని జేసీ ఆదేశించారు.

Similar News

News October 6, 2025

ప్రకాశం సీపీఓగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు

image

ప్రకాశం జిల్లా నూతన సీపీఓగా కె.సుధాకర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులోని సీపీఓ కార్యాలయంలో ఆయన భాద్యతలు స్వీకరించగా, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన పరిధిలో అన్ని పనులను ఎప్పటికప్పుడు నిర్వర్తించి జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తానని ఆయన వివరించారు.

News October 6, 2025

ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటన ఖరారు?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్ నెలలో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్ నెలలోనే పవన్ ప్రకాశం రానున్నారని తెలుస్తోంది.

News October 5, 2025

ప్రకాశం: 9 పేకాట స్థావరాలపై దాడులు.. 55 మంది అరెస్ట్

image

జిల్లాలో ఆదివారం 9 పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 55 మందిని పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒంగోలు తాలూకా, ఎస్ఎన్ పాడు, ఎస్ కొండ, జరుగుమల్లి, మర్రిపూడి, మార్కాపురంలలో పేకాట స్థావరాల నుంచి రూ. 93,630 నగదు, ఎస్ కొండలో కోళ్ల పందెం రాయుళ్ల వద్ద రూ. 1,27,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.