News May 10, 2024
కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన విశాఖ కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం సందర్శించారు. జిల్లాలోని క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతున్న వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటికే ఎన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్ని చోట్ల ఏర్పాటు చేయాలి అనే విషయమై అధికారులను ఆరా తీశారు.
Similar News
News February 16, 2026
అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.
News February 16, 2026
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.
News February 16, 2026
విశాఖలో శాప్ లీగ్ క్రీడా పోటీల పోస్టర్ విడుదల

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ‘శాప్ లీగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ లీగ్‌లో భాగంగా ఈనెల 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చదరంగం (Chess) పోటీలు, 24న మర్రిపాలెంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


