News April 27, 2024

కమిట్మెంట్ ఉన్న నాయకుడు RS ప్రవీణ్ కుమార్: KCR

image

నాగర్ కర్నూల్ BRS MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిని MPగా గెలిపించుకుంటే మన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మాజీ సీఎం KCR అన్నారు. నాగర్ కర్నూల్‌లో శనివారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన RS ప్రవీణ్ కుమార్ వాటిని ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు అని అన్నారు.

Similar News

News December 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, ఉమ్మడి జిల్లా నేతలు✔అభివృద్ధికి సహకరించండి: బండి సంజయ్✔ప్రారంభమైన రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు✔REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్✔కార్మికుల హామీలు నెరవేర్చాలి:CITU✔జోగులాంబ అమ్మవారి సేవలో హీరో ఆకాశ్✔కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔GREAT:రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔GWDL:Way2Newsతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆవేదన

News December 27, 2024

NGKL: మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, ఎంపీ

image

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ  మల్లు రవి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో రాష్ట్రానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

News December 27, 2024

MBNR: GET READY.. నేటి నుంచి ‘CM CUP-24’ పోటీలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని DSA మైదానంలో సీఎం కప్-2024 పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,584 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. 6 మ్యాట్లపై మ్యాచులు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ నెట్ బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి టోర్నీకి అతిథ్యం లభించింది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెల 2 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.