News December 29, 2025
కమిషనరేట్ పరిధిలో 77 గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు: సిద్దిపేట సీపీ

సిద్దిపేట జిల్లా అంతటా మద్యం అమ్మే అక్రమ బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ జరుగుతోందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు.ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల నిర్వహణ దృష్ట్యా మద్యం అక్రమ అమ్మకాలను నిషేధించడానికి ప్రజలు సహకరించాలన్నారు. 77 గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.11,25,700 స్వాధీనం చేసుకున్నామన్నారు. 440 ఎక్సైజ్ యాక్ట్ కేసులు, 203 అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News December 30, 2025
వంటింటి చిట్కాలు

* బాగా పండిన టమాటాలు పాడవకుండా ఉండాలంటే చల్లని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి రాత్రంతా ఉంచితే మర్నాటికి తాజాగా తయారవుతాయి.
* కూరల్లో ఉల్లిపాయకు బదులు క్యాబేజీ తురుమును వాడితే అంతే రుచిగా ఉంటుంది.
* చీమలు తిరిగే చోట వెనిగర్ కలిపిన నీళ్ళను చల్లి తుడవండి.
* రిఫ్రిజిరేటర్ దుర్వాసన వేస్తుంటే బ్రెడ్ స్లైస్ అందులో పెట్టండి.
* చాకుని ఉప్పు నీటిలో ఉంచితే పదునెక్కుతుంది.
News December 30, 2025
చెత్త రికార్డు.. 10 ఓవర్లలో 123 రన్స్ ఇచ్చాడు

విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచులో పుదుచ్చేరి కెప్టెన్ అమన్ హకీం ఖాన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. 10 ఓవర్లలో ఏకంగా 123 రన్స్ సమర్పించుకున్నారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇదే అత్యంత చెత్త రికార్డు. ఈ మ్యాచులో ఝార్ఖండ్ 368/7 స్కోరు చేయగా, పుదుచ్చేరి 235 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో JHA 133 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా ఇటీవల IPL వేలంలో హకీంను CSK ₹40 లక్షలకు కొనుగోలు చేసింది.
News December 30, 2025
ఆదిలాబాద్: 2025లో పోలీసుల అద్భుత ఫలితాలు

2025లో పోలీసులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది 20గా ఉన్న నేరస్తుల శిక్షల సంఖ్య ఈసారి 51కి పెరిగింది. CEIR ద్వారా 718 ఫోన్లను రికవరీ చేశారు. షీ టీమ్స్, పోలీస్ అక్క కార్యక్రమాలతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడమని ఎస్పీ వెల్లడించారు.


