News February 25, 2025
కమీషన్ల కక్కుర్తితో కంపెనీలను తరిమేశారు: స్వామి

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమల్ని తరిమివేశారని మంత్రి స్వామి శాసన మండలిలో ధ్వజమెత్తారు. మంగళవారం మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన లూలూ, అమర్ రాజా, ఏషియన్ పార్క్ ఇండస్ట్రీ లాంటి కంపెనీలన్నింటిని తరిమి వేసిన ఘనత జగన్‌దేనని అన్నారు.
Similar News
News February 25, 2025
మహిళలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

మహిళలకు అండగా “సఖి వన్ స్టాప్ సెంటర్” ఉంటుందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణలో ఉన్న”సఖి వన్ స్టాప్ సెంటర్”ను మంగళవారం ఎస్పీ సందర్శించారు. ఈ సెంటర్‌లోని కేంద్ర నిర్వాహణ గది, పోలీస్ సలహాదారు గది, రెసెప్షన్, తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ రూమ్‌లను ఎస్పీ తనిఖీ చేశారు.
News February 25, 2025
ప్రకాశం: ‘బుధవారం కూడా బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 26వ తేదీ బుధవారం కూడా పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం శివరాత్రి రోజు కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే,ఆన్లైన్ లో బిల్లులు చెల్లించవచ్చు అని పేర్కొన్నారు.
News February 25, 2025
మహాశివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు: ఎస్పీ

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ శైవక్షేత్రాలు వద్ద నిర్వహించే తిరునాళ్ల, రథోత్సవాలు వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి భద్రతా, ట్రాఫిక్ సమస్యలు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.