News November 23, 2025

కమ్మగూడెం: 30ఏళ్లుగా మద్యం అమ్మకాలు నిషేదం

image

మర్రిగూడ మండలం కమ్మగూడెంలో 30ఏళ్లగా మద్యం అమ్మకాలు నిషేధించారు. ఇక్కడ నివసించే గ్రామస్థులు107 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ గ్రామంలో గొలుసు దుకాణాలు లేవని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గొలుసు దుకాణాల నిర్మూలనకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని ఊర్లలో గొలుసు లేకుండా చేయాలని వారు సూచించారు.

Similar News

News November 23, 2025

ప్రొద్దుటూరులో అప్పులోళ్ల ఆందోళన..!

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని పలువురు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామని, ఇతను పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ఆయన జైలుకు పోతే తమ డబ్బులు రావేమోనని భయపడిపోతున్నారు. తమ డబ్బులు కూడా పోలీసులే వసూలు చేయించాలని కోరుతున్నారు.

News November 23, 2025

ఓవైపు CBN, రేవంత్.. మరోవైపు జగన్, KTR

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెండు కీలక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో AP CM చంద్రబాబు, TG CM రేవంత్ ఒకే వేదికను పంచుకున్నారు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కు AP మాజీ CM వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి KTR కలిసి హాజరయ్యారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీశాయి.

News November 23, 2025

జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

తూర్పుగోదావరి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (2026-27) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. పాత కార్డుల గడువు ఈ నెల 30తో ముగుస్తుండటంతో నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్హులైన పాత్రికేయులు సమాచార పౌర సంబంధాల శాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని, నూతన కార్డులు రెండేళ్ల పాటు అమలులో ఉంటాయని ఆమె వెల్లడించారు.