News February 22, 2026
కమ్మర్ పల్లి: రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి

కమ్మర్ పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎక్స్‌ఎల్‌పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి కుమార్తె వసంత ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 25, 2026
కార్మికులకు గుడ్ న్యూస్: 40 దాటితే హెల్త్ చెకప్!

40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. ESIC 75వ వేడుకల్లో మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయం చెప్పారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి రిఫరల్స్ తగ్గించాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంతో ESICని అనుసంధానించేలా ఒప్పందం చేసుకున్నారు. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని, ESIC సేవలు ఎయిమ్స్ (AIIMS) స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.
News February 25, 2026
నంద్యాల జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చర్యలు: కలెక్టర్

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి సమగ్ర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
News February 25, 2026
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

TG: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణ వ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సెంటర్‌కు స్టూడెంట్స్ గంట ముందే చేరుకోవాలి. అయితే పరీక్ష స్టార్ట్ అయిన ఐదు నిమిషాల వరకు లోపలికి అనుమతించనున్నారు. సెంటర్లను CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.


