News December 27, 2025
కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటి గడ్డగా నల్లగొండ జిల్లా

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం సీపీఐ జిల్లాలో దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి, గిట్టుబాటు ధరలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన పార్టీ నిర్మాణంతో ప్రజల మధ్య పని చేస్తూ సమ సమాజ సాధనే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగుతోంది.
Similar News
News December 27, 2025
మోత్కూరు: 20 గుంటల్లో.. 23 పంటలు

మోత్కూరుకు చెందిన ఆదర్శ రైతు బిల్లపాటి గోవర్ధన్‌రెడ్డి కేవలం 20 గుంటల భూమిలో 23 రకాల పంటలను సాగు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. రసాయన రహిత ఆహారమే లక్ష్యంగా నాలుగేళ్లుగా సేంద్రియ సాగు చేస్తున్నారు. కాలజీరా, బహురూపి, మణిపురి బ్లాక్ వంటి దేశవాళి వరి రకాలను పండిస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల ఆధారంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
News December 27, 2025
నర్సంపేట: పొలాల్లో మొసలి కలకలం!

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఓ రైతు పొలంలో శుక్రవారం సాయంత్రం మొసలి పిల్ల కనిపించింది. స్థానికులు భయంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది మొసలిని పట్టుకొని ఖానాపురం మండలం పాకాల సరస్సులో వదిలినట్లు తెలిపారు. సమీపంలో వాగు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
News December 27, 2025
మరణంలోనూ వీడని స్నేహం

కర్ణాటకలో జరిగిన ఘోర <<18664780>>బస్సు ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చనిపోయిన వారిలో నవ్య, మానస అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. మరణంలోనూ వారు కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి రోదించారు. ‘వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే కంచంలో తినేవారు. ఒకేచోట చదువుకున్నారు. ఒకే రకం డ్రెస్సులు వేసుకునే వారు. ఒకేచోట పని చేస్తున్నారు. సెలవని ఇంటికొస్తూ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు’ అని విలపించారు.


