News August 24, 2025

కరపలో కేజీ చికెన్ రూ.200

image

కరప మండలంలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ లైవ్ చికెన్ రూ. 140, మాంసం రూ.180, స్కిన్‌లెస్ రూ.200 కి విక్రయిస్తున్నారు. ధరలు పెరిగినప్పటికీ షాపుల వద్ద కొనుగోలుదారులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయగలరు.

Similar News

News August 24, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హీరో బాలకృష్ణ పేరు

image

నటసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా అభిమానులను అలరించడం, 15 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు NBK కావడం విశేషం. ఈ గుర్తింపు సాధించిన బాలయ్యను ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సత్కరించనున్నారు.

News August 24, 2025

రూ.70లక్షల అప్పుచేసి వ్యాపారి పరార్

image

గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం అనే చీరల వ్యాపారిని, అతనితో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని తమిళనాడుకు చెందిన వినోత్ రాజ్ మోసం చేశాడు. టెక్స్‌టైల్స్ వ్యాపారం పేరుతో రూ.70 లక్షలకుపైగా అప్పు చేసి పరారయ్యాడు. రాజేశం ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోత్ రాజ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News August 24, 2025

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.