News February 7, 2025
కరప: గుండెపోటుతో తాటి చెట్టుపైనే కార్మికుడి మృతి
కరప మండల కేంద్రంలో ఒక కల్లుగీత కార్మికుడు తాటిచెట్టుపై గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం సాయంత్రం రామ కంచి నగర్ కాలనీ వద్ద పెంకె శ్రీనివాస్(43)అనే కల్లుగీత కార్మికుడు తాటి చెట్టు పైకి ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ సంఘటన గమనించిన స్థానికులు చెట్టు పైకి ఎక్కి కిందకు దింపారు. అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
Similar News
News February 7, 2025
రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!
ఈనెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే పలు జిల్లాల్లో 27న కూడా సెలవు ఉండనుంది. ఆరోజు TGలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC, APలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. APలో శ్రీకాకుళం, విజయనగరం, VZG, ఉ.గోదావరి, కృష్ణా, GTR, TGలో MDK, NZB, ADB, KNR, WGL, KMM, NLGలో టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
News February 7, 2025
ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలి: DEO
జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 7, 2025
MLC ఎన్నికల బరిలో నలుగురు జన్నారం వాసులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జన్నారం మండలానికి చెందిన నలుగురు నిలిచారు. మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, చింతగూడకు చెందిన మేకల అక్షయ్ కుమార్, దేవుని గూడెం గ్రామానికి చెందిన గవ్వల శ్రీకాంత్, ఆయన భార్య గవ్వల లక్ష్మి శ్రీకాంత్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మండలానికి చెందిన మరి కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసే అవకాశముంది.