News January 6, 2026
కరప: తల్లి మందలించిందని మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నివసించే సంగాని సూరిబాబు ఫ్యామిలీతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా తనను మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి(16) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.
Similar News
News February 14, 2026
బడ్జెట్: కర్నూలు జిల్లాకు ఇలా..

★ ఓర్వకల్లులో 300 ఎకరాల్లో దేశంలోనే తొలి సమగ్ర డ్రోన్ సిటీ అభివృద్ధి
★ కర్నూలులో 30 పడకల ESI ఆసుపత్రి
★ పర్యాటక ప్రాంతంగా అహోబిలం అభివృద్ధి
★ ఏవీఆర్ హంద్రి-నీవా పూర్తికి చర్యలు
★ రాయలసీమను గ్లోబర్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి
★ సూపర్-6 పథకాలకు భారీ కేటాయింపులు.. జిల్లా ప్రజలకు లబ్ధి
★ జిల్లా పోలీసు శాఖకు కొత్త వాహనాల కేటాయింపు
★ పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై దృష్టి
News February 14, 2026
విశాఖ: హిప్పో ‘పద్మ-దళపతి’పై కథ రాస్తారా?

ప్రపంచ హిప్పోపొటామస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలోని ఇందిరా గాంధీ జూలో ప్రత్యేక కథా రచన పోటీ జరగనుంది. ‘ హిప్పోలు పద్మ – జూనియర్ దళపతి’ థీమ్‌తో ఉదయం 10-12 గంటల వరకు జూ బయోస్కోప్‌లో ఈ పోటీ ఉంటుంది. దీనికి వయస్సు పరిమితి లేదు. ఆసక్తి ఉన్నవారెవరైనా నేరుగా జూ పార్కులో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
News February 14, 2026
IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!

T20 WCలో IND vs PAK మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా 7-1తో మనదే ఆధిపత్యం. 2007 ‘బౌల్ అవుట్’ విక్టరీ నుంచి 2024 ‘న్యూయార్క్ లో-స్కోరింగ్ థ్రిల్లర్’ వరకు భారత్ తన సత్తాను చాటుతూనే ఉంది. విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మిరాకిల్ (2022), బుమ్రా డెత్ ఓవర్ల మ్యాజిక్ (2024) వంటి మధుర జ్ఞాపకాలతో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేపటి మ్యాచ్‌లోనూ దాయాదుల పోరు ఆసక్తికరంగా సాగనుంది. IND విజయాల ఫొటోలను పైన చూడొచ్చు.


