News December 29, 2025
కరీంగనర్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు.. వివరాలివే!

జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను అధికారులు విడుదల చేశారు. 2011 జనగణన ప్రకారం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో 66 వార్డులు, 328870 మంది జనాభా, ST-5999, SC-36902 మంది ఉన్నారు. కాగా, చొప్పదండిలో 14 వార్డులు, 16459 మంది జనాభా కాగా.. ST 205, ఎస్సీ 3062, హుజురాబాద్‌లో 30 వార్డులు, 34555 జనాభా, ST-309, SC-6326, జమ్మికుంటలో 30 వార్డులు, 39476 జనాభా ST 286, SC 7623గా ఉంది.
Similar News
News December 31, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.
News December 31, 2025
KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
News December 30, 2025
కరీంనగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదొండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.


