News March 25, 2025

కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో ఇంజినీరింగ్ విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

Similar News

News February 26, 2026

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

image

టారిఫ్‌ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.

News February 26, 2026

తీర్థం ఎందుకు తీసుకోవాలి?

image

తీర్థం తీసుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. తీర్థం సకల పాపాలను హరించి, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో ఉంచే తీర్థం రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది మంత్రోక్తమైన దైవ శక్తిని కలిగి ఉంటుందని పండితులు మాట. ‘తీర్థం తీసుకుంటే మనసు ప్రశాంతమవుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవాలి’ అంటున్నారు.

News February 26, 2026

ఫ్రెంచ్ అబ్బాయి.. యానాం అమ్మాయి.. ఒక్కటైన వేళ!

image

భారతీయ సంప్రదాయంపై మక్కువతో ఓ ఫ్రెంచ్ యువకుడు యానాం అమ్మాయిని హిందూ పద్ధతిలో వివాహమాడారు. పారిస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఫ్రెంచ్ జాతీయత కలిగిన యానాం అమ్మాయి అనిత అనూష, అక్కడే ప్రభుత్వ అధికారిగా ఉన్న రొమెన్ షులెర్ ప్రేమించుకున్నారు. మన సంస్కృతిపై గౌరవంతో రొమెన్ తన కుటుంబ సభ్యులు, 45 మంది ఫ్రెంచ్ మిత్రులతో కలిసి యానాం వచ్చి, వేద మంత్రాల సాక్షిగా బుధవారం రాత్రి అనూషకు మూడు ముళ్లు వేశారు.