News March 25, 2025

కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

Similar News

News February 27, 2026

TTD అన్నదానం విరాళాల్లో మార్పులు!

image

తిరుమల శ్రీవారి అన్నదానంలో రోజువారి విరాళంతో పాటు తక్కువ మందికీ అన్నదానం చేసే వెసులుబాటు కల్పించేలా టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. 10, 100మందికి చొప్పున కూడా విరాళం ఇచ్చే అవకాశాన్ని కల్పించి.. సామాన్య భక్తులను అన్నదానంలో భాగం చేయాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రోజు మొత్తానికి రూ.44లక్షలు, ఉదయం టిఫిన్‌కు రూ.10లక్షలు, రాత్రి, మధ్యాహ్న భోజనానికి రూ.17లక్షల చొప్పున విరాళాలు ఇచ్చే అవకాశమే ఉంది.

News February 27, 2026

NGKL: ప్రశాంతంగా ముగిసిన మూడో రోజు ఇంటర్ పరీక్షలు

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 7,163 మంది విద్యార్థులకు గాను 6,908 మంది హాజరు కాగా, 255 మంది గైర్హాజరైనట్లు నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

టమాటా మిర్చి అ’ధర’హో.. ఒక్కరోజే రూ.10వేలు పెరిగింది

image

TG: టమాటా మిర్చి రకం రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరంగల్(D) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ ఈ మిర్చి క్వింటా ధర ఏకంగా రూ.50,000 పలికింది. ఈ నెల 18న క్వింటా రూ.35,000, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇవాళ ఒక్క రోజే క్వింటాకు రూ.10,000 పెరిగింది. 9 రోజుల్లో క్వింటా టమాటా మిర్చి ధర రూ.15వేలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.