News April 2, 2024
కరీంనగర్‌లో కొడుకుకి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

కరీంనగర్‌లో దారుణం జరిగింది. బొమ్మకల్‌కు చెందిన ఓ తల్లి శ్రీజ.. ఏడాదిన్నర వయసున్న కొడుకుకి విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసి శ్రీజ తల్లి జయప్రద విషం తాగింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 1, 2026
KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 28, 2026
KNR: ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఆలోచించాలి: ప్రొ.తిరుపతి

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పడాల మాట్లాడారు. మన దేశ శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ దృక్పథంతో మెలుగుదామన్నారు. “వికసిత భారత్” కల సాకారం కావాలంటే ప్రతి విద్యార్థి ఒక చిన్న శాస్త్రవేత్తగా ఆలోచించాలని, విద్యార్థులు పరిశోధనల వైపు మలగాలని పిలుపునిచ్చారు.
News February 27, 2026
BREAKING: కరీంనగర్‌లో కొలువుదీరిన కొత్త కలెక్టర్

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టగా.. నూతన కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్రా మిశ్రా పేర్కొన్నారు.


