News July 22, 2024
కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉచిత గ్రాండ్ టెస్టులు

గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు 5వ రోజు ప్రశాంతంగా జరిగినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రవి కుమార్ తెలిపారు. మొత్తం 4 గ్రాండ్ టెస్టులు, 16 పరీక్షలు ఉంటాయన్నారు. కరీంనగర్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సోమవారం 50 మంది హాజరైనట్లు వెల్లడించారు. 3వ గ్రాండ్ టెస్టు జులై 23న, 4వ గ్రాండ్ టెస్టు జులై 30, 31 తేదీల్లో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టెస్టులు ఉపయోగించుకోవచ్చన్నారు.
Similar News
News February 19, 2026
KNR: ‘10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న నెల రోజులు పదో తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అన్నారు. అందువల్ల ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News February 19, 2026
KNR: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (2026-27) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఎం. నాగేశ్వర్ తెలిపారు. అర్హత గల పాఠశాలలు తమ దరఖాస్తులను మార్చి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం రెసిడెన్షియల్ కింద రూ.42,000, నాన్-రెసిడెన్షియల్ కింద రూ.28,000 చెల్లిస్తారు.
News February 19, 2026
కరీంనగర్: చెక్ డ్యామ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిషిద్ధం

నదులపై ఉన్న చెక్ డ్యామ్‌ల రక్షణ దృష్ట్యా వాటికి ఎగువ, దిగువన 300 మీటర్ల మేర ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో ఇసుక నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


