News June 4, 2024
కరీంనగర్‌లో బండి, పెద్దపల్లిలో గడ్డం వంశీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో ఉత్కంఠ వీడింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 28 మంది పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2,12,017+ ఓట్లతో గెలుపొందారు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మొత్తం 42 మంది పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 131,581+ ఓట్లతో గెలిచారు. దీంతో నేటితో జిల్లాలోని ఎంపీ స్థానాలపై ఉత్కంఠకు తెర పడింది.
Similar News
News November 15, 2025
భరోసా కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.
News November 15, 2025
కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.
News November 15, 2025
KNR: టాస్క్ జాబ్ మేళాకు విశేష స్పందన.. 54 మంది షార్ట్‌లిస్ట్

KNR IT టవర్‌లోని టాస్క్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 209 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని టాస్క్ ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించగా, 54 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరికి త్వరలో తుది రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.


