News November 3, 2025
కరీంనగర్‌లో ‘మున్నూరుకాపు’ డామినేషన్

KNR రాజకీయాలలో మున్నూరుకాపు సామాజికవర్గం డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రిగా బండి సంజయ్ కుమార్, MLAగా గంగుల కమలాకర్ కొనసాగుతుండగా, తాజాగా జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లోనూ ఛైర్మన్‌గా అదే వర్గానికి చెందిన కర్ర రాజశేఖర్ గెలుపొందారు. 12 మంది డైరెక్టర్లలో ఏడుగురు కాపులే గెలవడం గమనార్హం. నిన్నటి వరకు KNR కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా చల్లా స్వరూప హరి శంకర్ కొనసాగారు.
Similar News
News November 3, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.

చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.